గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. తాజాగా ఈ సినిమా ఇటలీ షూటింగ్ కష్టాలను బయటపెట్టింది రాశి ఖన్నా. ఆమె మాట్లాడుతూ.. కరోనా వేవ్ తాకిడి ఎక్కువ అవుతున్న వేళ ఇండియా నుండి బయటకు వెళ్లాలంటే భయం వేసింది. ఇటలీలోను కొన్ని చోట్ల కరోనా కేసులు బయటపడడంతో మాకు అనుమతి లభించలేదు. అయినా రిస్క్ చేసి మరి షూటింగ్ కంప్లీట్ చేశాం. రోజుకి 18 గంటలు కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ సినిమాలోను నటిస్తున్న విషయం తెలిసిందే.