Site icon NTV Telugu

RAPO 20: బోయపాటితో ఇస్మార్ట్ రామ్.. అఫిషియల్

ram

ram

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే లింగుస్వామి నిర్మాణంలో ది వారియర్ ని ప్రకటించిన రామ్.. ఇది పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన బోయపాటి శ్రీనుతో రామ్ చేతులు కలిపాడు. అఖండ తరువాత బోయపాటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఊర మాస్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించినా అందులో నిజంలేదనుకున్నారు. కానీ సడెన్ గా ఈ కాంబో అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. బోయపాటి 10వ చిత్రం.. రామ్ కు 20వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు.ఇక ఈ విషయాన్ని రామ్ ట్విట్టర్ వేదికగా తెలుపుతూ “డాడీ ఆఫ్ మాస్ ఎమోషన్స్ బోయపాటి గారి కళ్లలో నన్ను నేను చూసుకోడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నాను”. అని చెప్పుకొచ్చాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ తో చాక్లెట్ బాయ్ ని మాస్ అవాతారంలో చూపించాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు బోయపాటి రామ్ ని ఊర మాస్ అవతారంలో చూపించనున్నాడు. ఇప్పటికే రామ్- బోయపాటి లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వీరి ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version