Rani Mukerji and Kajol on not being friends despite being cousins: బాలీవుడ్ టాక్ షోల కింగ్ లాంటి షో – ‘కాఫీ విత్ కరణ్’ 7 సీజన్లను పూర్తిచేసుకొని తాజాగా 8వ సీజన్‌ను ప్రారంభించింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాణీ ముఖర్జీ, కాజోల్ ఈ షోలో కరణ్‌తో ముచ్చటించడానికి రావడంతో కొన్ని సీక్రెట్స్ బయట పెట్టించాడు కరణ్. నిజానికి ఈ ముగ్గురి పరిచయం ఇప్పటిది కాదు. డైరెక్టర్‌గా కరణ్, హీరోయిన్స్‌గా కాజోల్, రాణీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుండే మంచి ఫ్రెండ్స్ అని అంటూ ఉంటారు. నిజానికి అక్కాచెల్లెళ్లు అయినా కాజోల్, రాణీ మాత్రం అంతగా ఎందుకో కలవలేక పోయారు. అలా జరగక పోవడానికి కారణం ఏంటనేది ఏఈ కాఫీ విత్ కరణ్‌లో బయటపెట్టారు ఈ నటీమణులు. రాణీ ముఖర్జీ, కాజోల్.. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు కూడా అవుతారు. కానీ వీరి మధ్యలో ఫ్రెండ్‌షిప్ మాత్రం అంత ఘాడంగా ఉండేది కాదు, ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలో కలిసి నటించినా కూడా ఫ్రెండ్స్ అవ్వలేకపోయారు.
Ashish Reddy: ఘనంగా దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ నిశ్చితార్థం..
అదే విషయాన్ని కాఫీ విత్ కరణ్‌లో కరణ్ జోహార్ గుర్తుచేసి ఇప్పుడు చాలా క్లోజ్‌గా ఉన్నారు కానీ ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య అంతగా ఫ్రెండ్‌షిప్ ఏం లేదు కదాని అడిగాడు. అది నిజమేనని పేర్కొన్న కాజోల్ అది సహజంగా ఏర్పడిన దూరమే అని కాజోల్ సమాధానమిచ్చింది. వృత్తిపరంగా ఒకరినొకరం గౌరవించుకునేవాళ్లం అని ఆమె చెప్పుకొచ్చింది. కాజోల్ అక్కగానే తెలుసు, పెరుగుతున్నకొద్దీ మనుషుల మధ్య కూడా దూరం పెరుగుతుంది, మేము అంత ఎక్కువగా కలిసేవాళ్లం కాదని పేర్కొంది. కాజోల్ అక్క టౌన్‌లో ఉండేది, మేము జుహూలో ఉండేవాళ్లమని పేర్కొంది. అయితే కాజోల్ అక్క మాత్రం ఫ్యామిలీలో అబ్బాయిలతో ఎక్కువ క్లోజ్‌గా ఉండేదని రాణీ ముఖర్జీ చెప్పింది. కాజోల్ తండ్రి, రాణీ ముఖర్జీ తండ్రి.. ఇద్దరూ చనిపోయిన తర్వాత వారు ఆటోమేటిక్‌గా క్లోజ్‌గా అయ్యామని రాణీ బయటపెట్టింది. అది నేచురల్‌గా జరిగిపోయిందని కాజోల్ కూడా ఒప్పుకుంది.