Ranbir Kapoor: బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ప్రస్తుతం తల్లిదండ్రులు అవ్వడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అలియా ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. ఈ జంట ఎన్నో ఏళ్ళు ప్రేమలో ఉండి ఈ ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లైన కొన్ని రోజులకే పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక ప్రెగ్నెంట్ అయ్యాకా కూడా అలియా షూటింగ్స్ అని, ప్రమోషన్స్ అని తిరుగుతూనే ఉంది. తాజాగా ఈ జంట తమ వివాహ బంధంలోని చిన్న చిన్న చిలిపి ఫిర్యాదులు మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ బెడ్ రూమ్ సీక్రెట్స్ ను పంచుకున్నారు.
“అలియాతో బెడ్ షేర్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆమె ఒకలా పడుకోదు. కాళ్లు ఆ మూల.. తల ఈ మూల పెడుతోంది. ఇక నిద్రలో పాములా మెలికలు తిరుగుతూ ఉంటుంది. బెడ్ మీద స్థలం మొత్తం ఆక్రమిస్తోంది. పొద్దునే లేచేసరికి నేను ఒక మూలన పడుకుంటాను. ఆమెతో చాలా కష్టం”అని చెప్పుకొచ్చాడు. ఇక అలియా, రణబీర్ గురించి చెప్తూ “రణబీర్ చాలా సైలెంట్. తక్కువ మాట్లాడతాడు. ఎక్కువ వింటాడు. కొన్నిసార్లు ఆ మౌనం హాయిగా ఉంటుంది కానీ మరికొన్ని సార్లు అదే ఇబ్బంది పెడుతోంది”అని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా ఈ భార్యాభర్తల చిలిపి ఫిర్యాదులు బాగానే ఉన్నాయి కానీ.. ఇవన్నీ పెద్దవి కాకుండా చూసుకొంటే మంచిదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ జంట నటించిన బ్రహ్మస్త్ర ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొంది. ప్రస్తుతం అలియా నెలలు ననిండుతుండడంతో సినిమాలకు గ్యాప్ ఇవ్వగా రణబీర్ యానిమల్ సినిమాలో నటిస్తున్నాడు.