Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan Leak: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ ‘రామాయణం’. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్నెట్లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ‘సినీమాకాన్’ ఈవెంట్లో ప్రదర్శించిన అఫీషియల్ ట్రైలర్ నుంచి ఒక 11 సెకన్ల క్లిప్ లీక్ అయిందంటూ నెట్టింట ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రణబీర్ కపూర్ శ్రీరాముడి అవతారంలో కనిపిస్తూ.. తన ముందు ఉన్న ఒక భారీ రాక్షసుడిపై బాణం గురిపెట్టి విసరడం కనిపిస్తుంది. ఈ 11 సెకన్ల లీక్డ్ క్లిప్‌లో రణబీర్ కపూర్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఆయన విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతుంటే.. లీక్డ్ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అయితే ఈ వీడియోలో రణబీర్ లుక్ కంటే కూడా ఆయన ముందు నిలబడిన ఒక భారీ ఆకారం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ రాక్షసుడిని చూసిన నెటిజన్లు.. అది ‘గాడ్జిల్లా’ లేదా ‘కింగ్ కాంగ్’ లా ఉందంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఈ లీక్డ్ వీడియో క్లిప్‌పై మీమ్స్, ట్రోల్స్ వరద మొదలైంది. “రామాయణంలో ఇలాంటి గాడ్జిల్లా లాంటి రాక్షసుడు ఎక్కడున్నాడు బాబోయ్?” అని ఒకరు.. “లోకీ సిరీస్‌లోని విజువల్స్ లా ఉంది” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. “నాకైతే ఇది చూస్తుంటే మళ్లీ ‘ఆదిపురుష్’ వైబ్స్ వస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో ఇంకో ఆదిపురుష్ తీస్తున్నారా ఏంటి?” అంటూ మరికొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌పై నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా.. మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొందరు నెటిజన్లు మాత్రం ఇది పక్కా ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా మేకర్స్ అఫీషియల్‌గా గ్లింప్స్ రిలీజ్ చేస్తేనే కానీ ఈ లీక్ వెనుక ఉన్న అసలు నిజం బయటపడదని మరికొందరు చర్చించుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!