Animal: సందీప్ రెడ్డి వంగ ‘అనిమల్’ ఫస్ట్ లుక్ వస్తోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’ కామెంట్స్ చేశారు. ఈ మాటలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో, ‘అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో తన నెక్స్ట్ సినిమాలో చూపిస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్’ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అన్నట్లు గానే సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. పేరులో ‘అనిమల్’ ఉండడంతో, సందీప్ రెడ్డి తన సినిమాపై వచ్చిన విమర్శలని అసలు మర్చిపోయినట్లు లేడని అంతా అనుకున్నారు.
ఈ మాటని నిజం చేస్తూ ఇటివలే ‘అనిమల్’ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి రణబీర్ కపూర్ ఫోటో ఒకటి లీక్ అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రణబీర్ కపూర్ బియర్డ్ లుక్ లో, చాలా రగ్గడ్ గా కనిపిస్తున్నాడు. రక్తం అంటుకున్న చొక్కాలో రణబీర్ కపూర్ ముందెన్నడూ చూడనంత డెడ్లీ లుక్ తో ఉన్నాడు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ, సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ తో అసలు ఎలాంటి సినిమా ప్లాన్ చేశాడు అంటూ అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ‘అనిమల్’ మూవీని 2023 ఆగస్టులో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ‘ఫస్ట్ లుక్’ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31న ‘అనిమల్’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి సందీప్ రెడ్డి వంగ అండ్ టీం నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజావార్తలు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?