పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలిజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మొత్తంలో రానా, పవన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చాడు డైరెక్టర్. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరనుంచి పవన్ ని మాత్రమే హైలైట్ చేయడంతో రానాను సైడ్ చేసేశారు. అతను కూడా స్టార్ హీరోనే కదా.. పవన్ ని హైలైట్ చేయడానికి రానాను వాడుకుంటున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ఇక ఈ ట్రైలర్ చుసిన తరువాత రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారట. ఇంకా చెప్పాలంటే పవన్ పాత్ర కన్నా రానా పాత్రనే హైలైట్ గా నిలుస్తుందని ఫాన్స్ నొక్కి వొక్కాణిస్తున్నారు. ఇప్పటివరకు రానా పాత్రను దాచి ఉంచడానికి ఇదే కారణమని, ట్రైలర్ చూశాక సినిమాలో కూడా రానానే హైలైట్ గా నిలవనున్నాడని తెలుస్తోంది. గతంలో రానాకు ప్రాధాన్యత తగ్గుతోందంటూ ప్రొడ్యూసర్ పై కామెంట్ లు చేసి ఫ్యాన్స్ అంతా ఇప్పడు హ్యాపీగా ఫీలవుతున్నారట. మరి నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డానియేల్ శేఖర్ త స్పీచ్ తో అదరకొడతాడేమో చూడాలి.