Site icon NTV Telugu

Ravi Teja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగిల్ గా సీసా సాంగ్!

Naa Peru Seesa Song Release

Naa Peru Seesa Song Release

ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగల్ ‘నాపేరు సీసా’ పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్… సీసా (సీకాకులం సారంగీ) గా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ పాటలో ట్రెడిషనల్ వేర్ లో కనిపించిన రవితేజ సరసన ఉల్లాసంగా ఆడిపాడింది అన్వేషి. థియేటర్ లో మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా వుంది ‘నా పేరు సీసా’ సాంగ్. సామ్ సి.ఎస్. మాస్ ఈ పాటని డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేయగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ‘నా పేరు సీసా / ఒకరికినే తేనె సీసా / ఒకరికినే కల్లు సీసా / ఒకరికినే మసాలా సీసా / ఇంకొకరికి రసాల సీసా / అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’ అంటూ సాగే ఈ పాటలో పదాలన్నీ క్యాచీగా ఉన్నాయి. ‘ఒకరికి నేను నీటి సీసా, ఇంకొకరికి నేను సెలైన్ సీసా’ అని చెప్పడం కొసమెరుపు! పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్ గా ఈ పాటని ఆలపించారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుపుకుంటోంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=ZUPYbt7KKME

Exit mobile version