Ramcharan : ఆ విషయంలో సురేంద్రరెడ్డి పై ఫైర్ అయిన రాంచరణ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఇండస్ట్రీ లో మల్టీస్టార్ర్ర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.. ఒకప్పుడు సీనియర్ హీరో మరియు నేటి తరం స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలును అయితే చేసేవారు.కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే బాగా మారింది, ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు.. ఇదంతా ఆర్ఆర్ఆర్ మూవీ ఇచ్చిన ధైర్యం అనే చెప్పవచ్చు.అయితే ఆర్ఆర్ఆర్ కి ముందే ఒక క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమా మిస్ అయ్యిందని తెలుస్తుంది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కలిసి ఒక మల్టీస్టార్ర్ర్ చేయాల్సి ఉంది..ఆ సినిమా ఇంకేదో కాదు, రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన దృవ సినిమా.ఇందులో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందుగా పునీత్ రాజ్ కుమార్ ను అనుకున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.
ముందుగా రామ్ చరణ్ కి ఆ విషయం గురించి చెప్పకుండా నేరుగా పునీత్ రాజ్ కుమార్ ని కాంటాక్ట్ చేసి అడిగేశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ కి ఎంతో మంచి స్నేహితుడని అందరికి తెలుసు.. తన సొంత కుటుంబ సభ్యుడిలాగా అయితే చూస్తాడు, అందుకే రామ్ చరణ్ సినిమా అనగానే అస్సలు ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశాడట పునీత్ రాజ్ కుమార్. ఈ సంగతి రామ్ చరణ్ కి తెలిసిన తర్వాత ఆయన అస్సలు ఒప్పుకోలేదని సమాచారం.. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ ని విలన్ రోల్ లో చూపిస్తే కర్ణాటక రాష్ట్రం అంతా ఆగ్రహం వ్యక్తం అవుతుంది., కన్నడ ప్రజల తాకిడిని అస్సలు తట్టుకోలేము అని సురేందర్ రెడ్డి కి చెప్పి, స్వయంగా పునీత్ రాజ్ కుమార్ కి ఫోన్ చేసి మరీ ఈ విషయం చెప్పాడట రామ్ చరణ్. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ మిస్ అయ్యిందని తెలుస్తుంది.. తనని అడగకుండా డైరెక్ట్ గా పునీత్ రాజ్ కుమార్ ని సంప్రదించినందుకు సురేందర్ రెడ్డి పై అప్పట్లో రామ్ చరణ్ ఫైర్ అయ్యినట్టుగా సమాచారం.. ఇక ఆ తర్వాత ఆ పాత్ర కోసం పలువురి హీరోలను సంప్రదించి, కుదరకపోవడం తో అరవింద్ స్వామిని తీసుకున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాలో హీరో పాత్ర కంటే కూడా విలన్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చూసాము.. ఇంత మంచి పాత్రని మిస్ చేసుకున్న హీరోలు నిజంగా దురదృష్టవంతులే అని చెప్పవచ్చు.. అయితే రామ్ చరణ్ ఆలోచన పునీత్ రాజ్ కుమార్ విషయం లో మాత్రం కరెక్ట్ అనే చెప్పవచ్చు.పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినీ పరిశ్రమ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఆయనని అభిమానులు ఆరాధ్య దైవం లాగా అయితే భావిస్తారు, ఆయన చనిపోయిన తర్వాత కన్నడ ప్రజలు ఎంతలా తల్లడిల్లిపోయారో మన కళ్లారా చూసాము. అలాంటి అభిమానం ఉన్న హీరో ని విలన్ రోల్ లో చూపిస్తే ఇంకేమన్నా వుందా.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!