Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana vs Godzilla: 2026 దీపావళికి అరుదైన బాక్సాఫీస్ పోరుకు వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ గ్లోబల్ క్లాష్ తప్పేలా లేదు. ఒకవైపు భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘రామాయణం’, మరోవైపు జపాన్ దిగ్గజ రాక్షస ఫ్రాంచైజీ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య జరిగే పోటీ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో పాటు, నవంబర్ 6న రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు దీపావళి సెలవుల సీజన్‌ను పూర్తిగా ఉపయోగించుకునేలా ప్లాన్ చేశారు మేకర్స్. వారాంతంతో పాటు గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి పండుగల సెలవులు కూడా ఉండటంతో మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద థియేట్రికల్ విడుదలల్లో ఒకటిగా నిలవనున్న ‘రామాయణం’ కు దేశీయ మార్కెట్లో భారీ ఆధిక్యం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, విదేశీ మార్కెట్లో మాత్రం గట్టి పోటీ ఎదురుకానుంది. అదే రోజు దర్శకుడు తకాషి యమజాకి తెరకెక్కించిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో వచ్చిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ కేవలం 10 మిలియన్ డాలర్ల అంచనా బడ్జెట్‌తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అకాడమీ అవార్డు అందుకున్న తొలి ఆంగ్లేతర భాషా చిత్రంగా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ కొత్త మూవీపై కూడా గ్లోబల్ గా భారీ బజ్ ఏర్పడింది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడంతో ఐమాక్స్, ఇతర ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్ల కోసం కూడా తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇటీవల ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఐమాక్స్ స్క్రీన్ల పరిమితి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. అయితే ‘రామాయణం’ ఈ క్లాష్ ను తట్టుకుని నిలబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయులు ఈ మూవీని ఆదరిస్తారనే ధీమాతో ఉన్నారు మేకర్స్. ఒకవైపు భారతీయ ఆధ్యాత్మిక ఇతిహాసం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కైజూ ఫ్రాంచైజీ మధ్య జరుగనున్న ఈ పోరు బాక్సాఫీస్ క్లాష్ మాత్రమే కాదు. రెండు విభిన్న సంస్కృతులు, రెండు భారీ విజువల్ స్పెక్టాకిల్స్, రెండు గ్లోబల్ మార్కెట్ల మధ్య జరిగే ఆసక్తికరమైన పోటీగా నిలవనుంది. దీపావళి 2026లో ప్రేక్షకులు శ్రీరాముడి గాథను ఎంచుకుంటారా, లేక గాడ్జిల్లా విధ్వంసాన్ని ఆస్వాదిస్తారా అనేది తెలవాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు