Ramarao On Duty: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యంకా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ గా కట్ చేశారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చేయలేని పనిని రామారావు అనే కలెక్టర్ ఎలా చేశాడు అనేది కథగా తెలుస్తోంది. ఒక ఆపరేషన్ కోసం కష్టజీవులను వాడుకుంటారు కొందరు రాజకీయ నాయకులు. తరువాత వారిని మాయం చేస్తారు. వారికి పోలీసులు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ నిజాయతీ గల రామారావు ఈ ఆపరేషన్ లో మాయమైన వారికోసం పోరాడుతూ ఉండడం కనిపిస్తోంది. మధ్యలో ఇద్దరు హీరోయిన్లతో రామారావు రొమాన్స్ ఆకట్టుకొంటుంది.
రవితేజ ఫ్యాన్స్ కోరుకొనే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ సినిమాలో ఉండనున్నదని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక రామారావు గా రవితేజ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు రవితేజకు కొత్తేమి కాదు.. సీఐ మురళిగా వేణు కొత్తగా కనిపించాడు. ట్రైలర్ ను బట్టి చూస్తుంటే వేణు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆ ఆపరేషన్ ఏంటి..? ఈ ఆపరేషన్ వలన రామారావు కోల్పోయింది ఏంటి..? చివరికి మిస్ అయ్యిన వారిని రామారావు కనిపెట్టడా..? అనేది సినిమా కథగా తెలుస్తోంది. శ్యామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకొంటుంది. ట్రైలర్ తోనే రవితేజ సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమా జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసారి రవితేజ క్రాక్ లాంటి విజయాన్ని దక్కించుకుంటాడా..? లేదా అనేది చూడాలి.