Ramam Raghavam: స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం “రామం రాఘవం”. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లిమ్స్ ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విట్టర్ ఖాతాలో డిజిటల్ విడుదల చేసి చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మీడియా గ్లింప్స్ ను రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ… “ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమాను తీశారు. గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఎమోషనల్ జర్నీ తో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజును తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లింప్స్ విడుదల చెయ్యడం కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. ప్రతికొడుకుకు మొదటి ప్రేమ తల్లి తండ్రినే. ముఖ్యంగా తండ్రీకొడుకుల ప్రేమ పైకి చూపించరు కానీ.. వారి మధ్య బాండింగ్ సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది. తండ్రి విలువ.. ఆయన లేనప్పుడు కానీ, కొడుకు తండ్రి అయ్యాక కానీ తెలిసి రాదు అంటారు. మరి ఇందులో తండ్రీకొడుకుల ప్రేమను ఎలా చూపించారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న. ‘రామం రాఘవం’తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఈ గ్లింప్స్ చూసాక ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యేలానే ఉన్నాడు అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.