అక్కినేని అఖిల్ పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవ్వడానికి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాక్షి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘రామకృష్ణ’ సాంగ్ రిలీజ్ అయ్యింది. బాయ్స్ కోసం మంచి బ్రేకప్ సాంగ్ లా ‘రామకృష్ణ’ పాట బయటకి వచ్చింది. ఇప్పటివరకూ స్పై యాక్షన్ సినిమాగానే ప్రేక్షకులకి పరిచయం అయిన ఏజెంట్ సినిమాకి లోకల్ టచ్ ఇచ్చారు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఎంత క్యాచీగా ఉన్నాయో, రామ్ మిర్యాల వాయిస్ అంతే అప్పీలింగ్ గా ఉంది.
Read Also: KGF 2: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున బాక్సాఫీస్ దగ్గర సునామీ పుట్టింది
ప్రతి ఒక్కరూ హమ్ చేసేలా హిప్ హాప్ తమిళ మంచి ట్యూన్ ఇచ్చాడు. అఖిల్ డాన్స్ మూమెంట్స్ తో ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడు. ఈ సాంగ్ తో ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ కి మంచి ఊపు వచ్చేలా ఉంది. మరి ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో? పాన్ ఇండియా హిట్ కొడతాడో లేదో చూడాలి. అఖిల్ కి మణిరత్నం లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ 2 గట్టి పోటీ ఇస్తోంది. తమిళ, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల్లో PS-2 సినిమాకి ఏజెంట్ సినిమా కన్నా కాస్త ఎక్కువ ఎడ్జ్ దొరికే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ దెబ్బకి PS-2 సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించడం గ్యారెంటీ.
Hello! BOYS🤘🏻
Staring vibing to THE BOYS ANTHEM 😎#RamaKrishna Full Song Out now💥– https://t.co/SZGoKdOzEi#AGENT#AGENTonApril28th@AkhilAkkineni8 @sakshivaidya99 @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @boselyricist @Ram_Miriyala #Sekhar @AKentsOfficial @LahariMusic pic.twitter.com/f7ohjTvsfW
— AK Entertainments (@AKentsOfficial) April 13, 2023
https://www.youtube.com/watch?v=RKJxB62wQiY
