Ram remuneration for Ismart Shankar sequel: వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో హీరో రామ్ కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం హీరో రామ్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే బ్లాక్ బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌లో కూడా నటించాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం రామ్ తన కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ 2019లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ కాగా, పూరి జగన్నాధ్, రామ్ పోతినేని ఇద్దరికీ బాగా వర్కౌట్ అయింది.
Payal Rajput: వాళ్లు తప్పుదోవ పట్టించి, వాడుకున్నారు.. పాయల్ సంచలన వ్యాఖ్యలు
ఈ సినిమా సీక్వెల్ కోసం వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాకి డబుల్ ఇస్మార్ట్ అని టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ తన కెరీర్‌లో అత్యధికంగా 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తన మునుపటి చిత్రం ‘లైగర్’ నిరాశపరిచిన తరువాత, దర్శకుడు పూరీ జగన్నాధ్ ఒక పెద్ద హిట్‌తో తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకే ‘డబుల్ ఇస్మార్ట్’ అనే పాన్-ఇండియన్ సినిమాతో నటుడు రామ్ పోతినేనితో జతకట్టాడు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళ భాషలలో విడుదల కానుందని అంటున్నారు. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు? హీరోయిన్ ఎవరు? లాంటి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.