The Warriorr మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం “ది వారియర్” అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా The Warriorr మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
Read Also : Naga Chaitanya : ‘మానాడు’ డైరెక్టర్ తో అక్కినేని వారసుడి మూవీ
‘వారియర్’గా రామ్ ఈ వేసవిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ తెలుగు, తమిళ సినిమాని జూలై 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఇప్పటికే ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న కథానాయికగా కనిపించబోతున్న కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ఆమె విజిల్ మహాలక్ష్మిగా ట్రెండీ లుక్‌లో కనిపించింది. ఇక ఇటీవల మహా శివరాత్రి రోజు ఆది ఫస్ట్ లుక్ విడుదలైంది. రామ్ మొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ చిత్రం ఇస్మార్ట్ హీరోకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.