ప్రస్తుతం ఉక్రెయిన్ దేశం ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెల్సిందే. రష్యా దేశం.. తమ సైన్యంతో ఉక్రెయిన్ పై దండెత్తింది. గత కొద్దిరోజులుగా ఈ ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఉక్రెయిన్ సైన్యంతో పాటు అమాయక పౌరులను కూడా యుద్దానికి పంపి వారి మరణాలకు కారణమవుతున్నారు ఉక్రెయిన్ ప్రభుత్వం. ఇక ఈ యుద్ధంపై ఎంతోమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
అమాయక ప్రజలు ఎందుకు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం ఈ యుద్ధంపై తమదైన స్పందన తెలిపారు. ఇక తాజగా టాలీవుడ్ కుర్ర హీరో రామ్ యుద్ధంపై ఆసక్తికర ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. “యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు.. కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికిసైన్యాన్ని వాడడం వారి బ్లడీ గాడ్ డామ్ డ్యూటీ!” ఉక్రెయిన్ లో ఉన్న తెలుగువారిని కాపాడండి అనే హ్యాష్ ట్యాగ్ ని వాడుతూ రామ్ ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం రామ్ ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు.
