యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోండి మరోసారి టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా విడుదల అయిన ప్రతి చోట కూడా అద్బుతమైన రెస్పాన్స్ ను ఈ సినిమా దక్కించుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమ్ అవుతున్న విషయం విదితమే. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా .. మిగిలిన అన్ని భాషల్లో జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమాపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ బ్రోమాన్స్ కు ఫ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య మరింత బలపడింది.
ప్రమోషన్స్ లో వీరి స్నేహం చూసి అభిమానులు పండగ చేసుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా చూసి విదేశీయులు కూడా ఫిదా అవుతున్నారు. వారిలో కొంతమంది ఈ సినిమా గే డ్రామాగా మార్చేశారు. ఇద్దరు హీరోల బ్రొమాన్స్‌ని వెస్ట్రన్ ప్రేక్షకులు ‘గే’ డ్రామా అంటుడంతో హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో ధీటుగా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్టర్ వార్ రసవత్తరంగా సాగుతుంటే అందులో వర్మ మరింత రెచ్చగొట్టాడు. ‘‘నా ఉద్దేశం కరెక్టే.. ఇది ‘గే’ స్టోరీ అని వెస్ట్రన్ ప్రేక్షకులు చెప్పడంలో నిజముంది’’ అని సంచలన ట్వీట్ చేసాడు. ఇక దీంతో అభిమానులు వర్మపై విరుచుకుపడ్డారు. ఫ్రెండ్ షిప్ విలువ నీకేం తెలుస్తుంది అని కొందరు.. వోడ్కా తాగి సినిమా చూసావా..? అని మరికొందరు.. నీలాంటి సినిమాలు రాజమౌళి తీయడులే అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
I was right 😎 “They are so gay' Western audience's perception of 'RRR' as a gay story https://t.co/OxVDVr5Qsp
— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2022