Upasana Konidela: షాకింగ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. ఆందోళనలో ఫ్యాన్స్

upasana

upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత వారం రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడినట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి ప్రజలను పీడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని ఆనందించేలోపు మరోసారి ఎటాక్ అవ్వడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాసన తాజాగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. “గత వారం కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ముందే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్‌ నన్ను కేవలం పారాసిటమల్‌, విటమిన్‌ టాబ్లెట్స్‌ మాత్రమే వాడమని సూచించారు.

ఈ మహమ్మారి సోకడంతో చాలా మంది నేను నీరసించిపోతానని, జుట్టు రాలిపోవచ్చని, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు. అయితే ఇప్పడూ ఆ సమస్యలు ఏమి నాలో కనిపించడంలేదు. ఎందుకంటే నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందా? అంటే చెప్పలేను. కానీ, మనం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్‌ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్‌ బయటపడింది. లేదంటే అసలు తెలిసేదే కాదు.. అందుకోసం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని” ఉపాసన సూచించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.