Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క శంకర్ గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న చరణ్ .. బాలీవుడ్ ఎంట్రీఇవ్వనున్నాడా.. ? అంటే ఏమో నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేంటి.. తుఫాన్ సినిమాతో ఎప్పుడో ఇచ్చాడుగా అంటే.. ఈసారి వెబ్ సిరీస్ అని చెప్పుకొస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్.. తెలుగువారిని తమవద్దకు లాగేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రానా, వెంకటేష్ తో కలిసి రానా నాయుడు ను తెరకెక్కించింది. త్వరలో అక్కినేని నాగార్జున సైతం నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు చరణ్ సైతం వెబ్ సిరీస్ చేస్తున్నట్లు రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ రూమర్స్ పుట్టడానికి కూడా కారణం లేకపోలేదు. తాజాగా చరణ్ .. తన ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్ తో పాటు చరణ్ కనిపించాడు.
July 2023 Tollywood Releases: రంగబలి, భాగ్ సాలే, బ్రో సహా ఈ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలివే
” రాత్రి నుంచి నా భర్త కనిపించడం లేదు” అంటూ దీపికా ఏడుస్తూ చెప్పడంతో వీడియో మొదలయ్యింది. అంతలోనే రణవీర్ టార్గెట్ కనిపించాడు అనగానే ఏజెంట్ గా చరణ్ రంగంలోకి దిగాడు. ఇక చివర్లో త్రిష.. పోలీస్ స్టేషన్ లో నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది. కొన్ని రహస్యాలు ఎప్పటికి రహస్యాలుగానే ఉండిపోతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతక్కుండా వదిలేస్తేనే బెటర్.. కొన్ని మిస్టరీలను కనుక్కోకుండా వదిలేస్తేనే బెటర్ అంటూ రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రోమో.. సినిమానా..? లేక యాడ్ నా ..? అనేది తెలియాలంటే జూలై 5 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ఆ ప్రోమోను సంబంధించిన డీటైల్స్ చెప్పనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగి పోయింది. అసలు ఏంటి ఈ ప్రోమో అని తలలు పట్టుకుంటున్నారు. నిజంగానే ఇది వెబ్ సిరీస్ అయితే మాత్రం బాలీవుడ్ లో చరణ్ రేంజ్ ఓ రేంజ్ లో మరోసారి పెరిగిపోతుంది. ఆర్ఆర్ఆర్ లో సీతారామరాజు లుక్ చూసే చాలామంది చరణ్ ను రాముడుగా కొలిచేస్తున్నారు. అంత ఫిదా ఐపోయారు. మరి ఈ ప్రోమోలో చరణ్ ను చూసి వారు కూడా ఆ రేంజ్ లోనే ఉహించుకుంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
