Peddi : మెగా స్టార్ చిరంజీవి ఆ తర్వాత రామ్ చరణ్ డ్యాన్స్ లో ఇరగదీస్తారు. ఇందులో నో డౌట్. కానీ ఈ మధ్య రామ్ చరణ్ నుంచి ఓ హుక్ స్టెప్ లేదనే బెంగ మెగా ఫ్యాన్స్ ను వెంటాడింది. మనకు తెలిసిందే కదా.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో వేసిన హుక్ స్టెప్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ఏకంగా గ్రౌండ్ లో క్రికెట్ స్టార్లు కూడా ఈ హుక్ స్టెప్ ను వేశారు. దీంతో సినిమా వరల్డ్ లో దాని గురించి చర్చ జరిగింది. ఇలాంటి ఓ పాపులర్ హుక్ స్టెప్ తమ హీరోకు కూడా కావాలని చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
Read Also : Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్ కీలక నిర్ణయం..
మొత్తానికి దాన్ని తీర్చేశాడు మన మెగా పవర్ స్టార్. మొన్న పెద్ది సినిమా నుంచి వచ్చిన చికిరి సాంగ్ లో అదిరిపోయే హుక్ స్టెప్ వేసేశాడు చరణ్. బ్యాట్ పట్టుకుని ఆయన వేసిన హుక్ స్టెప్ బాగా వైరల్ అవుతోంది. చాలా స్పీడ్ గా వేసిన ఆ స్టెప్.. ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఎందుకంటే ఆ స్టెప్ వేయడం అంత ఈజీ కాదు. కానీ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంది. ఈ హుక్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎంతైనా డ్యాన్స్ లో తమ హీరో లెవల్ వేరు అంటున్నారు.
Read Also : Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!
