Ram Charan: అఖిల్ తోనే బోణీ… రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకి సాగట్లేదు. ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేస్తే అందులో ఒకటే హిట్ అయ్యింది. ఇటీవలే సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏజెంట్’ సినిమా చేసాడు కానీ రిజల్ట్ తేడా కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బయ్యర్స్ కి నష్టాలు మిగిలించింది. దీంతో అఖిల్ అక్కినేని మార్కెట్ కి ఊహించని డెంట్ పడింది. ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్న అక్కినేని అభిమానులకి నిరాశ తప్పలేదు. కెరీర్ ని కష్టాల్లో పడేసిన ఏజెంట్ సినిమా నుంచి అఖిల్ ని బయటకి తెస్తూ మెగా పవర్ స్టార్ రంగంలోకి దిగాడట. ఏజెంట్ సినిమాను చరణ్ వంతుగా ప్రమోట్ చేశాడు చరణ్ కానీ సినిమా తేడా కొట్టింది. ఇలా కాదని ఈసారి ఏకంగా చరణ్ రంగంలోకి దిగాడని సమాచారం
చరణ్, అఖిల్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే ఇప్పుడు అఖిల్‌కు హిట్ ఇవ్వడం కోసం చరణ్ నిర్మాతగా మారనున్నాడు. యువి క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన విక్రమ్‌తో కలిసి.. చరణ్ కొత్త బ్యానర్ ‘వి మెగా పిక్చర్స్’ని స్టార్ట్ చేసాడు. ఈ బ్యానర్లో రానున్న ఫస్ట్ ఫిల్మ్ అఖిల్ దేనని అంటున్నారు. చాలా రోజులుగా అఖిల్ యూవీ క్రియేషన్స్‌లో కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ వార్తలు చరణ్ ప్రొడ్యూస్ చేయనున్న ప్రాజెక్ట్ గురించే అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని సమచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. చరణ్ ప్రొడక్షన్ అంటే మెగా అభిమానుల సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కినేని ఫాన్స్-మెగా ఫాన్స్ కలిసి ఈసారి అఖిల్ కి సాలిడ్ హిట్ ఇస్తారేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!