‘పుష్ప 2’ 2024 డిసెంబర్లో విడుదల కాగా, రెండేళ్ల నుంచి రామ్‌చరణ్ మూవీ కథ చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ‘ఆర్సీ 17’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ గుజరాతీ మూవీ ‘లాలో’ను పోలి ఉండడంతో రీమేక్ అంటూ ప్రచారం నడుస్తుంది. ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్లో నెమలి పింఛంలో మనిషి ఆకారం మిక్స్ చేశారు. ‘లాలో’ మూవీ పోస్టర్లా అనిపించడంతో ఇప్పుడు ఈ గుజరాతీ మూవీ తెలుగులో ట్రెండ్ అవుతోంది. 50 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ‘లాలో’ 122 కోట్లు కలెక్ట్ చేసింది. రెండేళ్ల నుంచి కథ రాసుకునే పనిలో లెక్కల మాస్టారు ఉన్నాడు. రీమేక్ మూవీ కోసం రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కథే వేరా? లేదంటే యాదృచ్ఛికంగా పోస్టర్ కలిసిందో లేదో మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
‘ఆర్సీ 17’లో రామ్‌చరణ్ ఎలా ఉంటాడో గానీ, ‘పెద్ది’లో కనిపించిన లుక్ నుంచి బయటకు రాలేదు. ఓపెనింగ్ డే లాంగ్ హెయిర్, గడ్డంతోనే కనిపించాడు. రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేకపోవడంతో, ఈలోగా సుక్కు స్టైల్లో స్టైలిష్ లుక్‌లోకి వస్తాడేమో చూడాలి. ‘ఆర్సీ 17’ హీరోయిన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అన్న ప్రశ్నలకు ఓపెనింగ్ డే ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటే సీక్రెసీ మెయింటైన్ చేశారు. సుకుమార్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్లేస్‌లో మరొకరు ఉంటారన్న ప్రచారం నడుస్తుంది. దేవిశ్రీని కాదని ఎవరిని తీసుకుంటాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా, సంగీత దర్శకుడిని ప్రకటించలేదు. అలాగే భాగ్యశ్రీ బోర్సే, సాత్వికా వీరవల్లి అంటూ చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా, ఆ ముద్దుగుమ్మ ఎవరో బయటపెట్టలేదు.

