మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘ఆచార‍్య’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొ ణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక తాజగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేదికపై చరణ్ మాట్లాడుతూ ” ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. నాన్న గారితో ఇంత మెమరబుల్ ఫిల్మ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు.. మీఅందరి సహకారం చాలా ఉంది.. నాన్నగారితో షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంత అద్భుతమైన సినిమాలో మీరందరు చిన్న భాగం అయ్యినందుకు థాంక్స్. నేను నాన్నగారిని చూసి ఇన్ని సంవత్సరాల్లో ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ మారేడుమిల్లి లో 20 రోజుల్లో జరిగిన షూటింగ్ లో మాత్రం చాలా నేర్చుకున్నాను. ఈ 20 సంవత్సరాలు నాకు నథింగ్ అని అనిపించాయి. అలంటి అవకాశం నాకు ఇచ్చిన శివగారికి థాంక్స్ చెప్తున్నాను. ముందుగా ఈ కథను శివగారు చెప్పినప్పుడు నాకు వచ్చిన మొదటి ఆలోచన రాజమౌళి గారు.. ఆయన గురించి ఒకటి చెప్పాలి. బొమ్మరిల్లు చిత్రంలో ప్రకాష్ రాజ్, సిద్దార్థ్ డైలాగ్ ఇప్పటికి నా చేయి మీ చేతిలో ఉంది నాన్న అన్నట్లు.. జక్కన్న సినిమా చేసే ప్రతి హీరో చేయి ఆయన చేతిలో ఉంటుంది. అయితే ఈ కథ వచ్చినప్పుడు ఈ సినిమా మా అమ్మ కోరిక అని తెలుసుకొని మొట్టమొదటిసారి ఆయన నా చేతిని వదిలేశాడు.
శివగారితో మిర్చి నుంచి ఒక సినిమా చేద్దామనుకున్నాం.. కానీ వేరే కమిట్ మెంట్స్ వలన అది కుదరలేదు. కానీ ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని ఎందుకు అంటారో నాకు ఆచార్య వలనే తెలిసింది. ఇక ఈ అదృష్టం కోసం అవన్నీ ఆగాయని అర్థమైంది. ఇక తారక్, మహేష్, ప్రభాస్ వేరే సినిమాల్లో యాక్షన్ హీరోలా కనిపిస్తే .. శివ గారి సినిమాల్లో మాత్రం ఒక బుద్ధుడు, వివేకానందుడు లా కనిపిస్తారు. ఇంత సింపుల్ గా రూ.100 కోట్లు ఎలా కొట్టేస్తారా ..? అని డౌట్ వచ్చేది ఇక నేను ఆచార్య సినిమా చేసినప్పుడు నాకు అర్థమైంది .. కథలో బలముంటే యాక్టర్లు ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు.. నార్మల్ గా డైలాగ్ చెప్తే నే ఆ మాటల్లో పవర్ ఉంటుంది.. ఆ మాటల్లోనే డాన్స్ ఉంటుంది.. శివ గారి రైటింగ్ లోనే ఒక పవర్ ఉంటుంది.. అలాంటి శివగారితో చేయడమే బొనాంజా అనుకుంటే నాన్నగారితో పాటు చేయడం డబుల్ బొనాంజా ఇచ్చారు. ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య కూడా నా జీవితంలో మర్చిపోలేనవి .. ఇలా ఎందుకు అంటున్నాను అంటే చాలామంది అంటూ ఉంటారు ఇంత కష్టపడి పనిచేస్తున్నావ్ అని .. కానీ నేను చాలా ఇష్టంతో పంచేస్తున్నాను.. అందుకే నాకు ఏనాడు ఈ పని కష్టంగా అనిపించలేదు. బల్లగుద్ది నేను చెప్పగలను ఏది నా మనసుకు చాలా దగ్గరైన క్యారెక్టర్.. ఏప్రిల్ 29 న ఆచార్య ప్రేక్షకుల ముందు వస్తుంది.. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాం” అని చెప్పుకొచ్చారు.