NTV Telugu Site icon

Acharya : కాజల్ వెర్షన్ తీసేశారా? చెర్రీ షాకింగ్ కామెంట్స్

Ram Charan

Ram Charan

“ఆచార్య” ట్రైలర్ సినిమాలో కాజల్ రోల్ పై పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కావడంతో మధ్యలోనే సినిమాలో నుంచి తప్పుకుందని, అప్పటికే ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలను మేకర్స్ సినిమాలో నుంచి కట్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇలా చేయడం వల్ల కాజల్ కు, ‘ఆచార్య’ టీంకు మధ్య విబేధాలు వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ విషయం గురించి స్పందించిన తీరు మరిన్ని డౌట్స్ పెంచేస్తోంది.

Read Also : Mahesh Babu : దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ ఇదా?

“ఆచార్య” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కాజల్ అగర్వాల్ గురించి ఎవరూ మాట్లాడలేదు. ట్రైలర్‌లోనూ ఆమె కనిపించలేదు. ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చెర్రీని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ కాజల్ పాత్ర ఎలా ఉందో చెప్పడానికి తాను సినిమా ఫైనల్ ఎడిట్ చూడలేదని రామ్ చరణ్ పేర్కొన్నాడు. అంతేకాదు ట్రైలర్ కట్ కూడా కొరటాల శివ కోరుకున్న విధంగానే చేశాడని చెప్పుకొచ్చాడు. నిజానికి ‘ఆచార్య’కు ముందుగా నయనతార, త్రిషలను హీరోయిన్ గా అనుకున్నారు. నయన్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయగా, త్రిష సృజనాత్మక విభేదాలను కారణంగా చూపిస్తూ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయింది. దీంతో కాజల్ ను ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ఇటీవ‌ల విడుద‌లైన “లాహే లాహే” సాంగ్ ప్రోమోలో కూడా కాజ‌ల్‌కి స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోవడంతో సినిమాలో నుంచి ఆమె పాత్రను పూర్తిగా లేపేశారనే టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే !