Site icon NTV Telugu

Bheemla Nayak : ట్రైలర్ పై రామ్ చరణ్ రివ్యూ

BHeemla-Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు, నిత్యా మీనన్ పోషించిన పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ మేనియాలో ఉంది టాలీవుడ్. ఆ లిస్ట్ లో మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. చెర్రీ తాజాగా “భీమ్లా నాయక్” ట్రైలర్ పై అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రివ్యూ ఇచ్చేశారు. “#భీమ్లానాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్ !! పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్ & యాక్షన్ “పవర్ ఫుల్”… నా మిత్రుడు రానా పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ అద్భుతం. #BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ఆల్ ది బెస్ట్!!” అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.

Read Also : Dhanush New Home : కోట్లలో ఖర్చు చేస్తున్న హీరో

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” 2020 చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. థమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె. చంద్రన్, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మార్చి 25న వెండితెరపైకి రానుంది.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version