NTV Telugu Site icon

Ram Charan: బాబాయ్ సినిమా గ్లిమ్ప్స్ అబ్బాయికి బాగా నచ్చేసిందట…

Ram Charan

Ram Charan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఇటివలే రిలీజ్ చేశారు. మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి పుష్కర కాలం అయిన సంధర్భంగా… గబ్బర్ సింగ్ సినిమాకి ట్రిబ్యూట్ లా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్ అండ్ స్వాగ్ ని చిన్న గ్లిమ్ప్స్ లోనే పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసిన హరీష్ శంకర్, ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసాడు.

డిజిటల్ వ్యూస్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ టాప్ ట్రెండ్ అవుతూ ఉంది. 24 గంటల్లోనే 500K లైక్స్ సాధించిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ లింక్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ “Loved this massy glimpse of  @PawanKalyan garu cannot wait to witness this massive entertainer in theatres” అంటూ ట్వీట్ చేశాడు. బాబాయ్ సినిమా గురించి అబ్బాయ్ ట్వీట్ చెయ్యడంతో మెగా ఫాన్స్, ట్విట్టర్ లో చరణ్ ట్వీట్ ని లైక్స్ అండ్ రీట్వీట్స్ కొడుతూ వైరల్ చేస్తున్నారు. 

Read Also: Ustaad Bhagat Singh: దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది…

Show comments