‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తికరంగా మారింది. చరణ్ తన 17వ చిత్రం (#RC17) కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి ఒక తాజా అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం, #RC17 సినిమా లాంచ్, పూజా కార్యక్రమాలు రేపు అత్యంత ఘనంగా జరగాల్సి ఉంది. మెగా అభిమానులు కూడా ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ‘సరైన ముహూర్తం కుదరకపోవడమే’నని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్.
భారీ బడ్జెట్, భారీ అంచనాల నడుమ తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో, ముహూర్తం విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు సరైన శుభ ఘడియలు లేకపోవడం వల్లే లాంచ్ ఈవెంట్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం. తాజా ప్లాన్ ప్రకారం.. వాయిదా పడిన ఈ పూజా కార్యక్రమాన్ని అక్టోబర్ 25వ తేదీ తర్వాత నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 25 తర్వాత పండితులు సూచించిన ఒక మంచి శుభ ముహూర్తాన్ని ఖరారు చేసి, ఆ రోజున సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలతో పాటు కొత్త ముహూర్తం తేదీపై అధికారిక ప్రకటన రానుంది. అప్పటివరకు మెగా అభిమానులు కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే!

