మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని మేజర్ సెంటర్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న RC 15 లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ ప్రాంతంలో జరుగుతుంది. సింహాద్రి అప్పన్న సాక్షిగా, ఒక భారి సెట్ ని వేసి RC 15 సినిమా సాంగ్ షూట్ చేస్తున్నాడు శంకర్. చరణ్, కియారా అద్వానీలపై డిజైన్ చేసిన ఈ సాంగ్ చరణ్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ని సంబంధించినది అనే టాక్ వినిపిస్తోంది. సాంగ్ తో పాటు ఈ ప్రాంతంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని కూడా శంకర్ ప్లాన్ చేసాడని మెగా అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ఫైట్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు కానీ సాంగ్ మాత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ
సాంగ్ షూట్ ఈ పాటికి అయిపోయి ఉండాల్సింది కానీ కియారా అద్వానీ మ్యారేజ్ ఉండడంతో, ఈ సాంగ్ ని వాయిదా వేసి చరణ్ పొలిటికల్ ప్రచారానికి సంబంధించిన ఎపిసోడ్స్ ని షూట్ చేశారు. కియారా తిరిగి సెట్స్ కి వచ్చేయడంతో శంకర్ సాంగ్ ని స్టార్ట్ చేశాడు. ఈ సాంగ్ RC 15 మూవీకే హైలైట్ అవుతుందని సెట్ వర్క్, మేకింగ్ టైంలో లొకేషన్ లో ఉన్న ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే RC 15 సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ మార్చ్ 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆరోజు చరణ్ బర్త్ డే ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసి అఫీషియల్ గా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి RC 15 ఫస్ట్ లుక్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.