మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే రామ్ చరణ్, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదల కాగానే వెంటనే చరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదలై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ లో వాలిపోయింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే చరణ్ కుటుంబానికి, భార్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. వీలు చిక్కినప్పుడల్లా భార్య ఉపాసనా తో వెకేషన్ కు చెక్కేస్తాడు. ఇక నిన్నటికి నిన్న ఉపాసన వారిద్దరూ కలియుసి వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు చరణ్ పెట్టిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ” ఉపాసనా.. నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది..!! కాకపోతే #RC15 షూట్ విశాఖలో జరుగుతోన్న కారణంగా మనం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే” అని చెప్పుకొచ్చాడు. దాంతో పాటు అంతకుముందు వెకేషన్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.