పురాణ ఇతిహాసాలు రామాయణం, మహా భారతం ఆధారంగా ఎన్నో సినిమాలొచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఒక్క మహా భారతం నుంచే అంతులేని కథలు అల్లుకోవచ్చు. పూర్తి మహాభారతాన్ని చూపించాలనేది మన దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పుడొచ్చినా.. ఖచ్చితంగా జక్కన్న నుంచి మహాభారతం రావడం మాత్రం ఖాయం కానీ ప్రస్తుతం రామాయణం ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రభాస్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా ఆదిపురుష్ నిలవబోతోంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ కూడా రామాయణం ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన కోలాబోరేట్ అయ్యి బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో.. ఎప్పటి నుంచో ‘రామాయణం’ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది కానీ స్టార్ క్యాస్టింగ్ మాత్రం ఫైనల్ అవడం లేదు.
ఇటీవలె ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా.. ఆలియా భట్ సీతగా.. కెజియఫ్ స్టార్ యష్ రావణుడిగా.. నటించబోతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో ఒక రూమర్ జోరుగా వినిపించింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా.. ఈ ప్రాజెక్ట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు తెర పైకి వచ్చింది. రాముడిగా చరణ్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని, చాలా రోజులుగా సోషల్ మీడియా వేదికగా చెబుతూ వస్తున్నారు మెగాభిమానులు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు రామాయణంలో రామ్ చరణ్ అనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. అయితే.. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. నిర్మాత అల్లు అరవిందే కాబట్టి.. ఆయన అడిగితే చరణ్ నో చెప్పే ఛాన్స్ లేదు. ఇక చరణ్‌ను రాముడిగా ఫిక్స్ చేసిన సోషల్ మీడియా వర్గాలు.. సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని ఫైనల్ చేశారు. మొత్తంగా.. రాముడిగా రామ్ చరణ్, సీతగా సాయి పల్లవి.. అనే క్రేజీ రూమర్ మాత్రం.. ప్రస్తుతం ఫుల్ ఎగ్జైటింగ్‌గా మారింది.