Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, సుకుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. “కొన్ని విజయాలు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని తృప్తిని ఇస్తాయి. కానీ ‘పెద్ది’ విజయం నా లైఫ్‌నే మార్చేసింది. నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఈ సినిమాకు ప్రేక్షకులు నేరుగా నా గుండెల్లోకి వెళ్లిపోయేలా రివ్యూలు ఇచ్చారు. థియేటర్లలో చిన్న పిల్లల దగ్గర నుంచి లుంగీలు కట్టుకుని ముసలివాళ్ల వరకు డాన్స్ చేస్తుంటే వచ్చే అనుభూతి చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాను నమ్మి థియేటర్లకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కు నా ధన్యవాదాలు” అని అన్నారు.
సినిమా ప్రభావం తన ఇంట్లోనే ఎలా ఉందో చెప్తూ చరణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “ఈ సినిమాను ప్రేక్షకులు ఎంత సక్సెస్ చేశారంటే.. రామచరణ్‌ను మర్చిపోయి పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమోనని భయమేస్తోంది. ఇది నా ఇంట్లోనే స్వయంగా చూశాను. నా కూతురు క్లిం కారా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు నన్ను ‘నాన్న నాన్న’ అనేది. కానీ ఇప్పుడు నన్ను చూసి ‘ఏయ్ పెద్ది.. పెద్ది నాన్న’ అంటోంది. నా పేరే మార్చేసి ఇంతటి బ్యూటిఫుల్ మెమరీని ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబుకు థాంక్యూ” అంటూ నవ్వేశారు. డైరెక్టర్ సుకుమార్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చరణ్ చాటుకున్నారు. “బుచ్చిబాబు లాంటి వినయం ఉన్న వ్యక్తిని నా దగ్గరికి తీసుకొచ్చింది సుకుమార్ గారే. నా లైఫ్‌లో మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఆయనే. నేను ఎప్పుడైనా డౌన్లో ఉన్నప్పుడు, మా నాన్నగారితో కూడా చెప్పుకోలేని విషయాలు ఉంటే మొదట ఫోన్ చేసేది సుకుమార్ గారికే. ఆయన నాకు ఒక అన్నలాంటి వారు” అని ఎమోషనల్ అయ్యారు.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
మొదటి సినిమా ప్రొడ్యూసర్‌లా కాకుండా ఎన్నో సినిమాలు తీసిన అనుభవజ్ఞుడిలా ప్రొడ్యూసర్ సతీష్ ఈ చిత్రానికి బలమైన స్తంభంలా నిలిచారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కుస్తీ షాట్స్, ఢిల్లీ ఎపిసోడ్‌ను ఒక మాస్టర్పీస్లా స్క్రీన్‌పై చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సెకండ్ హాఫ్‌లో మేము పడ్డ కష్టానికి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశారు. ఐ లవ్ యు రెహ్మాన్ సార్. “ఠాగోర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. ‘తెలుగు ప్రజలు ఎవరిని అంత ఈజీగా ఇష్టపడరు.. ఒక్కసారి ఇష్టపడితే చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారు’ అని. ఈ సినిమాకు అటు ఇటుగా రివ్యూలు వచ్చినా, ప్రేక్షక దేవుళ్లు దీన్ని తమ భుజాలపై వేసుకుని నడిపించారు. ప్రతి ఒక్క రివ్యూవర్, ప్రతి ప్రేక్షకుడు ఫోన్ తీసి పెట్టిన మంచి రివ్యూలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. సినిమా అనే ఎమోషన్ యాక్టర్స్, డైరెక్టర్స్ కంటే చాలా పెద్దది” అని చరణ్ అన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్, స్పెషల్ సాంగ్ చేసిన శృతి హాసన్‌లకు థాంక్స్ చెప్తూ.. “నేను కథ విన్నప్పుడు ఇదొక కమర్షియల్ సినిమా అనుకున్నా.. కానీ ఇదొక పెద్ద ఎక్స్పెరిమెంట్ అని నాకు ఇప్పుడే తెలిసింది” అన్నారు. చివరగా ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కందుల దుర్గేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?