NTV Telugu Site icon

Amit Shah: ఆస్కార్ వచ్చాక అమిత్‌షాని కలిసిన రామ్ చరణ్, చిరంజీవి

Ram Charan Amit Chiru

Ram Charan Amit Chiru

Ram Charan Chiranjeevi Meets Amit Shah: అమెరికాలో ఆస్కార్ వేడుకలను ఘనంగా జరుపుకున్న అనంతరం ఈరోజు ఉదయం భారత్‌కి తిరిగొచ్చిన రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశాడు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ముగ్గురు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా.. ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకోవడం పట్ల అమిత్ షా అభినందించారు. సినిమాకు సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారు. ఇటు.. తండ్రితో కలిసి అమిత్‌షాను రామ్ చరణ్ కలవగా.. అటు తారక్ ‘ధమ్కీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు.. జూ. ఎన్టీఆర్‌ను అమిత్ షా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో కలుసుకున్న విషయం అందరికీ తెలిసిందే! ఆ సమయంలో వీళ్లిద్దరు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.

Viswak Sen: నా మాస్ అమ్మ మొగుడు.. ఎన్టీఆర్.. అసలు సినిమా ముందుంది

మరోవైపు.. ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహిస్తోన్న రెండు రోజుల సదస్సులో రామ్ చరణ్ పాల్గొనున్నాడు. అందుకే.. నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయి, అక్కడే ఉండిపోయాడు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రధాని మోడీతో కలిసి చరణ్ ఈ వేదికను పంచుకోనున్నాడు. కాగా.. మార్చి 12వ తేదీన జరిగిన ఆస్కార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు’ పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ దక్కిన విషయం విదితమే! దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. లాస్‌ఏంజెల్స్‌లో ఈ అవార్డ్‌ని కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత మొదటగా తారక్ భారత్‌కు తిరిగిరాగా.. మార్చి 17వ తేదీన టీమ్ మొత్తం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది.

Bandi Sanjay: ఎంతమంది చచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ స్పందించరు