Site icon NTV Telugu

Jr NTR: స్పెషల్ ఫోటోతో విషెస్ తెలిపిన రామ్ చరణ్

Charan Wishes Jr Ntr

Charan Wishes Jr Ntr

జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా వీళ్ళిద్దరూ ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళిద్దరే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పారు. పుట్టినరోజుల్ని అయితే చాలా స్పెషల్‌గా జరుపుకుంటామని, కారులో షికారుకి వెళ్తామంటూ తారక్ పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా! ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తమని మరింత దగ్గర చేసిందని ఇద్దరూ తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన ట్వీట్.. వీరి మధ్య నున్న గొప్ప స్నేహ బంధానికి నిదర్శనంగా నిలిచింది.

ఈరోజు (మే20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సెలెబ్రిటీలందరూ అతనికి విషెస్ తెలుపుతుండగా, రామ్ చరణ్ మాత్రం ఓ ప్రత్యేకమైన ఫోటోతో విష్ చేశాడు. తామిద్దరు గట్టిగా ఆలింగనం చేసుకున్న ఫోటోను చరణ్ షేర్ చేస్తూ.. ‘‘సోదరుడు, స్నేహితుడు, కో-స్టార్.. మన మధ్య ఉన్న బంధానికి, నువ్వు నాకు ఏమవుతావని చెప్పడానికి పదాలు నిర్వచించగలవని నేను అనుకోను. మన మధ్య ఉన్న బంధాన్ని నేనెప్పుడూ ఆదరిస్తూనే ఉంటాను. జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ తారక్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో, ఈ ట్వీట్‌తో పాటు చరణ్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది.

తమ అభిమాన హీరోల మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని చూసి, అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోలాగే ఆఫ్ స్క్రీన్‌లోనూ గొప్ప స్నేహితులుగా మెలుగుతున్న వీళ్ళు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా.. తారక్ తన తదుపరి సినిమాలైన NTR30, NTR31 ప్రాజెక్టుల్ని మొదలుపెట్టడానికి సిద్ధమవుతుండగా, చరణ్ ఆల్రెడీ దర్శకుడు శంకర్‌తో సెట్స్ మీదకి వెళ్ళాడు. అటు, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌ని కూడా మొదలుపెట్టే పనుల్లో నిమగ్నమయ్యాడు.

Exit mobile version