Ram Charan announces Co-Ownership of Hyderabad Team in ISPL-T10 : తాజాగా కొత్త క్రికెట్ లీగ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఈ లీగ్ లో ఓ కొత్త క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేశారు. రామ్ చరణ్ కొన్నది ISPLt10లో క్రికెట్ టీమ్. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10 2023 పేరిట మరో కొత్త క్రికెట్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ లీగ్ లో హైదరాబాద్ టీమ్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేసి ఈ విషయాన్ని స్వయంగా చరణ్ వెల్లడించారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆసక్తిగా, సంతోషంగా ఉంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో నేను టీమ్ హైదరాబాద్ కు ఓనర్ గా ఉన్నందుకు గర్వపడుతున్నా, గల్లీ క్రికెట్ కు వైభవం తీసుకొచ్చేందుకు, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ ఐఎస్పీఎల్ తోడ్పడుతుందని అన్నారు.
Hanuman: ఏమైనా క్రియేటివిటీనా.. వర్త్ వర్మా.. వర్త్ అంతే
ఇక ఈరోజు మరో ప్రకటన చేశారు రామ్ చరణ్. రామ్ చరణ్ ఈ కొత్త వెంచర్ గురించి మాట్లాడుతూ ఒక బిడ్‌ను ప్రారంభించి “ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో నా జట్టు హైదరాబాద్‌ను సహ-యజమాని చేయడానికి నాతో చేతులు కలపండి. ఆకాంక్షలను విజయాలుగా మార్చుకుందాం కలిసి చరిత్ర సృష్టిద్దాం.ispl-t10.comలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.” అని పేర్కొన్నారు. ఇక ఈ లీగ్‌లోకి రామ్ చరణ్ ఎంట్రీ స్థాయిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అంటే ఈ లెక్కన ఎవరు ఎక్కువ బిడ్ వేస్తే వారు రామ్ చరణ్ తో కలిసి జట్టుకు సహ యజమానిగా ఉంటారు.