Site icon NTV Telugu

Ram Charan and Upasana vacation : రెండేళ్ల తరువాత… పిక్ వైరల్

Ram-charan-and-Upasana

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్రకు వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గత రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఉపాసన వారు తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ రాసుకొచ్చింది. ఉపాసన షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇందులో చరణ్ మాస్క్ తో తన లుక్ ని కవర్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. “ఆర్సీ15” మేకోవర్ ను రివీల్ చేయకుండా ఉండడానికే ఆయనలా చేసి ఉండొచ్చని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Read Also : Prabhas : సోషల్ మీడియాకు దూరం… అభిమానులకు షాక్

ఇక మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే కన్నా ముందు అంటే మార్చ్ 25న “ఆర్ఆర్ఆర్” విడుదల కాబోతోంది. సినిమా విడుదల దగ్గర పడితే ప్రమోషన్లలో బిజీ అయిపోతాడు చరణ్. అందుకే ముందుగానే వెకేషన్ ను ప్లాన్ చేసినట్టున్నారు. ఇక దర్శకుడు శంకర్ సినిమా #RC15 తాజా షెడ్యూల్‌ షూటింగ్ ను రామ్ చరణ్ ముగించారు. రాజమండ్రి సమీపంలో జరిగిన ఈ షెడ్యూల్‌లో చెర్రీ పాల్గొన్నారు.

Exit mobile version