Ram Charan and Upasana vacation : రెండేళ్ల తరువాత… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్రకు వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గత రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఉపాసన వారు తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ రాసుకొచ్చింది. ఉపాసన షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇందులో చరణ్ మాస్క్ తో తన లుక్ ని కవర్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. “ఆర్సీ15” మేకోవర్ ను రివీల్ చేయకుండా ఉండడానికే ఆయనలా చేసి ఉండొచ్చని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
Read Also : Prabhas : సోషల్ మీడియాకు దూరం… అభిమానులకు షాక్
Also Read
- Manchu Manoj: మంచు మనోజ్ టీమ్‌లో మిస్టరీ డెత్.. 'డేవిడ్ రెడ్డి' సెట్స్‌లో అసలేం జరిగింది?
- Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Hanuman : మళ్లీ 'హనుమాన్' జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ఇక మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే కన్నా ముందు అంటే మార్చ్ 25న “ఆర్ఆర్ఆర్” విడుదల కాబోతోంది. సినిమా విడుదల దగ్గర పడితే ప్రమోషన్లలో బిజీ అయిపోతాడు చరణ్. అందుకే ముందుగానే వెకేషన్ ను ప్లాన్ చేసినట్టున్నారు. ఇక దర్శకుడు శంకర్ సినిమా #RC15 తాజా షెడ్యూల్ షూటింగ్ ను రామ్ చరణ్ ముగించారు. రాజమండ్రి సమీపంలో జరిగిన ఈ షెడ్యూల్‌లో చెర్రీ పాల్గొన్నారు.
Finally a vacation after 2 years !
Thank u Mr C ♥️♥️??@AlwaysRamCharan pic.twitter.com/AbLXU74OcG— Upasana Konidela (@upasanakonidela) March 6, 2022
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్‌లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్‌లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..