Ram Charan: అమ్మానాన్న కాబోతున్న రామ్ చరణ్ – ఉపాసన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: “ఎన్నాళ్ళో వేచిన ఉదయం..” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందగీతాలాపన సాగనుంది. చిరంజీవి నటవారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసనతో 2012 జూన్ 14న వివాహమయింది. అప్పటి నుంచీ మెగాస్టార్ ఫ్యాన్స్ తమకు ఓ బుల్లి హీరో ఉదయిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు పదేళ్ళ తరువాత అభిమానుల అభిలాష నెరవేరబోతోంది. రామ్ చరణ్- ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో దర్శన మిచ్చింది. హనుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తమ తొలి సంతానాన్ని పొందబోతున్నారని చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, అలాగే ఉపాసన కన్నవారు శోభన, అనిల్ కామినేని సంయుక్తంగా ఓ ప్రకటనలో పేర్కొనడం విశేషం! గతంలో పలుమార్లు అటు చెర్రీని, ఇటు ఉపాసనను వారి సంతానం విషయమై ప్రశ్నించగా, దేనికైనా సమయం రావాలని చెప్పేవారు. ఆ సమయం ఇన్నాళ్ళకు వారింటి తలుపు తట్టిందన్న మాట!
చిరంజీవి స్వయంగా ఆంజనేయస్వామి భక్తులు. చిరంజీవి అంటే హనుమాన్ మరో పేరు. చిరంజీవి కన్నతల్లి పేరు కూడా అంజనమ్మ. చెర్రీ పూర్తి పేరు రామ్ చరణ్ తేజ – అంటే రాముని చరణాల వద్ద వెలిగే తేజం అనగా హనుమంతుడు అనే అర్థం! ఇలా ఎలా చూసినా, చిరంజీవి కుటుంబసభ్యులకు ఆంజనేయుడంటే ఎంతో భక్తి. అదీగాక తమ కొణిదెల బ్యానర్ లోనూ హనుమంతుడే కనిపించేలా లోగోను తయారు చేసుకున్నారు. ఆ ఆంజనేయ స్వామి కరుణతో చెర్రీ – ఉపాసన దంపతులు ‘అమ్మా, నాన్న’ అన్న పిలుకు నోచుకోబోతున్నారని అభిమానులు ఆనందిస్తున్నారు. మరి ఉపాసన ఏ తేదీన ప్రసవించబోతున్నారో ఇంకా తెలియలేదు. ఏది ఏమైనా రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారన్న వార్త మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ ఆనందం పంచే అంశమే!
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!