మరి కొన్ని గంటల్లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ జెండా ఎగరేస్తే చూడాలని భారతీయ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక్క అవార్డ్ గెలిచినా మన ఇండియా సినిమా చరిత్రలో రాజమౌళి అండ్ టీం కొత్త చరిత్ర రాసినట్లే అవుతుంది. ఇండియాకి ఆస్కార్ తెస్తుందేమో అనే ఆశ కలిగించిన ఈ మూవీ వెస్ట్రన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. వెస్ట్ ఆడియన్స్, హాలీవుడ్ డైరెక్టర్స్, ఇంగ్లీష్ యాక్టర్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఫిదా అవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 నెలలు కావోస్తున్నా ఇప్పటికీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని మ్యాజిక్ ఇంకా తగ్గలేదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ అయిన ‘TCL చైనీస్ థియేటర్’లో ఆర్ ఆర్ ఆర్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది.
చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి కుటుంబాలతో పాటు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. ఈ స్క్రీనింగ్ తర్వాత చరణ్, ఎన్టీఆర్ లు ‘వెరైటీ మ్యాగజైన్ అవార్డ్స్ కేటగిరి సీనియర్ ఎడిటర్ అయిన క్లేటన్ డావిస్’కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ కోసం చరణ్, ఎన్టీఆర్ లు స్టైలిష్ లుక్ లోకి మారారు. సోషల్ మీడియాలో బయటకి వచ్చిన ఫోటోస్ ని చూసిన సినీ అభిమానులు మోడరన్ లుక్ లో ఉన్న కొమురం భీముడు- అల్లూరి సీతారామరాజు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ ఫోటోల్లో చరణ్ ‘బ్లూ కలర్ సూటు’లో ఉండగా, ఎన్టీఆర్ ‘వైట్ టీషర్ట్’లో ఉన్నాడు. ఈ భీమ్-రామ్ స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చే సోమవారం టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ తీసుకోని రాగలదు అని ప్రిడిక్షన్స్ లో చేర్చిన మొదటి మ్యాగజైన్ ‘వెరైటీ’నే.
I love Mondays.
Coming soon.@Variety #RRR @tarak9999 @ramcharan @AlwaysRamCharan @VarianceFilms @RRRMovie pic.twitter.com/RJopCFyTXa
— Clayton Davis – Stand with 🇺🇦 (@ByClaytonDavis) January 9, 2023