NTV Telugu Site icon

Mega MultiStarrer: ‘చరణ్ అర్జున్’ సాధ్యమేనా?

Charan Arjun

Charan Arjun

Mega MultiStarrer: అసలు సిసలు మల్టీస్టారర్‌కు నిదర్శనంగా నిలిచింది ఇటీవల వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఇలా ప్రస్తుత కాలంలోని ఇద్దరు సూపర్‌స్టార్లతో సినిమా చేయాలంటే ఎంతో కసరత్తు చేయాలి. రాజమౌళి కాబట్టే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ సాధ్యపడింది. అయినా ఆయా స్టార్స్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. అది టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో స్టార్స్ అభిమానుల తాటాకు చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలా మరో మల్టీస్టారర్ సాధ్యమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఆ ఆలోచన చేస్తోంది మహా గట్టివాడైన అల్లు అరవింద్ కాబట్టి. ఇటీవల ఓ టాక్ షోలో ఇదే విషయమై కొంచెం క్లారిటీ ఇచ్చాడు అరవింద్. అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. దీని కోసం ‘చరణ్ అర్జున్’ అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేశారట. దీనిని పలు దఫాలుగా రెన్యువల్ కూడా చేస్తు వస్తున్నాడట.

Read Also: Heroines Hot Gallery: హాట్‌ హాట్‌ భామలు.. అబ్బాయిలకు కిక్కే కిక్కు

ఈ ఇద్దరు హీరోల సూపర్‌ స్టార్‌డమ్‌‌ను హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు దొరకపోవడంతో పాటు వారి ఇమేజ్‌కు తగ్గ కథ సిద్ధంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడటం లేదట. నిజానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంతకు ముందు ‘ఎవడు’ అనే సినిమాలో కలిసి నటించారు. అయితే ఆ సినిమా కథ ప్రకారం ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. ఆ తర్వాత పరిస్థితులలో ఎంతో మార్పు వచ్చింది. రెండు ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ పెరిగిందనే రూమర్స్ ఎటూ ఉన్నాయి. ఇటు రామ్ చరణ్ అటు అల్లు అర్జున్ సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. సో వీరికి తగ్గ కథ సెట్ చేయాలంటే కత్తిమీద సామే. రాజమౌళి అనే అంశంతో పాటు ఎన్టీఆర్, చరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఉండటంతో ‘ఆర్ఆర్ఆర్’ ఆడుతూ పాడుతూ చేసేశారు. ఇక ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో చిరంజీవి, అరవింద్ ఫ్యామిలీస్ సందడి చేసినా రామ్ చరణ్ లేకపోవడం గమనించాల్సిన విషయమే. బయటకు తమ ఫ్యామిలీస్ మధ్య ఏమీ లేదని చెబుతున్నా చరణ్, బన్నీ మధ్య సమ్ థింగ్ గోయింగ్ ఆన్ అని గట్టిగానే వినిపిస్తోంది. బాలీవుడ్‌లో అప్పుడెపుడో సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ హీరోలుగా ‘కరణ్‌ అర్జున్‌’ రూపొంది ఘన విజయం సాధించింది. అదే సౌండింగ్‌ ఉన్న ‘చరణ్ అర్జున్’ సినిమా రూపొందితే మాత్రం రికార్డులను తిరగరాసే అవకాశం ఉంటుంది. అయితే అందుకు చరణ్‌, బన్నీ తమ తమ ఇగోలను పక్కన పెట్టి పని చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా అంటే చిత్రపరిశ్రమలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఇక్కడ అంతా సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. మరి ‘చరణ్ అర్జున్’ను తెరమీదకు తీసుకువెళ్ళే దర్శకుడు ఎవరో చూద్దాం.