‘రామ్ – అసుర్’ గా మారిన ‘పీనట్ డైమండ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, షాని సాల్మాన్, షెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘పీనట్ డైమండ్’. అభినవ్ సర్దార్ తో కలిసి దర్శకుడు వెంకటేశ్ త్రిపర్ణ ఈ సినిమాను నిర్మించాడు. అయితే ‘పీనట్ డైమండ్’ అనే పేరు మాస్ ఆడియెన్స్ కు రీచ్ కాదనే ఉద్దేశ్యంతో ఈ మూవీ టైటిల్ ను ఇప్పుడు ‘రామ్ – అసుర్’గా మార్చారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చగా, సినిమాటోగ్రఫీని జె. ప్రభాకరరెడ్డి అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్దంగా ఉన్న ఈ మూవీ నయా టైటిల్ పోస్టర్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ఇన్ కమ్ టాక్స్ అడిషనల్ కమీషనరీ జీవన్ లాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
చిత్ర దర్శక, నిర్మాత వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ, ”ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలనుకొని ‘పీనట్ డైమండ్’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టాం. కానీ మూవీ మేకింగ్ ప్రాసెస్ లో విజువల్స్ ఎక్స్ టార్డినరీగా, గ్రాండ్ గా వచ్చాయి. దాంతో వెల్ విషర్స్ సలహా మేరకు కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకే అందరికీ రీచ్ కావాలని మూవీ పేరును ‘రామ్ – అసుర్’ అని మార్చాం. ఓ కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ నుండి భారీ ఆఫర్ వచ్చినా కాదని, నవంబర్ 19న థియేటర్లలో విడుదల చేయబోతున్నాం” అని అన్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో, ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశామని, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ వంటి సీనియర్స్ నటించడంతో ఈ సినిమా వాల్యూ పెరిగిందని నటుడు, నిర్మాతల్లో ఒకరైన అభినవ్ సర్దార్ తెలిపాడు.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!