Site icon NTV Telugu

Rakul Preet Singh : ఆస్తులు తనఖా పెట్టాం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ కామెంట్స్..

Rakul (2)

Rakul (2)

Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీగా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ దివాలా తీసిందని… ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బ‌డే మియా.. ఛోటే మియా’ మూవీని జాకీ నిర్మించాడు. దీనికి భారీగా ఖర్చు పెడితే.. కనీస వసూల్లు కూడా రాలేదు. దీంతో జాకీ దివాలా తీశాడని.. ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడని.. తినడానికి కూడా తిండి లేక పారిపోయాడని నానా రకాల రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా జాకీ భగ్నానీ స్పందించాడు. అవన్నీ ఫేక్ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు.

Read Also : Saif Ali Khan : రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..

సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. ఈ సినిమా కోసం జూహు ఆఫీస్ ను తనఖా పెట్టాను. సినిమా పూర్తయ్యాక దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నా. అంతకు మించి నేనేం పెద్దగా నష్టపోలేదు. ఈ రూమర్లు ఎలా పుట్టాయో నాకు తెలియదు. ఈ రూమర్లపై నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ మరీ దారుణంగా నా మీద రాశారు. తినడానికి తిండి కూడా లేదని.. ఎటో పారిపోయాడంటూ మీడియాలో, సోషల్ మీడియాలో రాశారు. అవి వారి వ్యక్తిత్వానికే వదిలి పెడుతున్నాను. మూవీని సిన్సియర్ గా నిర్మించాను. కానీ అలీ అబ్బాస్‌ జాఫర్‌కు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాను. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతాను అంటూ తెలిపాడు జాకీ భగ్నానీ. రకుల్, జాకీ మూడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Read Also : Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్ తో డివోర్స్.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్..

Exit mobile version