Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakhi Sawant: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా తనను ముస్లింగా అంగీకరించకుండా ట్రోల్ చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మత విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ, విమర్శకులకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. రాఖీ సావంత్ ఒక మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు. 2022లో ఆదిల్ ఖాన్ దురానీని వివాహం చేసుకున్న సమయంలో ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును ఫాతిమాగా మార్చుకున్నారు. తర్వాత వారి వివాహ బంధం ముగిసినా, తాను ఇప్పటికీ ఇస్లాం మతాన్నే మనస్ఫూర్తిగా అనుసరిస్తున్నానని ఆమె చెబుతున్నారు. తన వ్యక్తిగత జీవితం మారినా, విశ్వాసం మాత్రం మారలేదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల బీబీసీ న్యూస్ హిందీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి విస్తృతంగా మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఎనిమిది సార్లు పవిత్ర మక్కా, మదీనా నగరాలకు వెళ్లి ఉమ్రా పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోజుకు ఐదు పూటలా నమాజ్ చేస్తానని, పవిత్ర ఖురాన్‌ను పఠిస్తానని, తహజ్జుద్ నమాజ్ కూడా ఆచరిస్తానని చెప్పారు. ఈ విశ్వాసమే తనకు మానసిక బలం, రక్షణ ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే బాలీవుడ్లో పనిచేయడం, గ్లామరస్ దుస్తులు ధరించడం వల్ల చాలామంది తనను నిజమైన ముస్లింగా చూడడం లేదని రాఖీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ముస్లింనా కాదా అనేది బయటివారు నిర్ణయించే విషయం కాదని, అది పూర్తిగా దేవుడికి, ఆ వ్యక్తికి మధ్య ఉండే సంబంధమని ఆమె అన్నారు. తన వృత్తి లేదా దుస్తుల ఆధారంగా మత విశ్వాసాన్ని కొలవడం సరికాదని స్పష్టం చేశారు.
Also Read
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
ట్రోల్స్‌ను ఉద్దేశించి రాఖీ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. నేను బాలీవుడ్లో పనిచేస్తున్నానని, పొట్టి దుస్తులు వేసుకుంటున్నానని నన్ను ముస్లిం కాదని ఎలా అంటారు? నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు? అంటూ ఆమె ప్రశ్నించారు. అలాగే తనను విమర్శించే వారిపై వ్యంగ్యంగా స్పందిస్తూ, మీరు కోటీశ్వరులు అయి ఉండొచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని ఒక్కసారి కూడా ఉమ్రాకు పిలవలేదు. నాకు మాత్రం ఎనిమిది సార్లు ఆ అదృష్టం దక్కిందని అన్నారు. రాఖీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనను తెచ్చుకున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం తన విశ్వాసాన్ని ధైర్యంగా సమర్థించుకున్నందుకు ప్రశంసిస్తున్నారు. మత విశ్వాసం అనేది పూర్తిగా వ్యక్తిగత అంశమని, దుస్తులు లేదా వృత్తి ఆధారంగా ఒకరి విశ్వాసాన్ని నిర్ణయించకూడదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాఖీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
- Tags
- cinema
- Rakhi Sawant
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!