Site icon NTV Telugu

Rakhi Sawant: ప్రియుడికి నచ్చట్లేదు.. అందుకే వదిలేశా

Rakhi Sawant On Exposing

Rakhi Sawant On Exposing

ప్రేమంటే సాధించుకోవడాలే కాదు, కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చలేదంటే, అది వదులుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న రాఖీ సావంత్.. తన ప్రియుడి కోసం ఓ త్యాగం చేసింది. ఎక్స్‌పోజింగ్‌ ఉండే బట్టలు వేసుకోవద్దని ప్రియుడు సూచించడంతో, వీలైనంతవరకూ శరీరాన్ని కప్పి ఉంచే బట్టలనే ధరించడం మొదలుపెట్టింది.

ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో రాణించాలంటే, స్కిన్‌ షో చేయడం తప్పనిసరి. సల్వార్‌ డ్రెస్‌తో కెరీర్‌ను ప్రారంభించినా, ఆ తర్వాతి సినిమాల్లో బికినీ వేసుకోక తప్పదు. ఎందుకంటే, పరిశ్రమలో నాకు గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. స్వయంకృషితోనే ఆఫర్లు అందిపుచ్చుకున్నా. కానీ.. నా ప్రియుడు అదిల్‌కు నేను ఎక్స్‌పోజింగ్‌ చేసేలా డ్రెస్సులు వేసుకోవడం నచ్చదు. అందుకే, బాడీ ఎక్స్ పోజ్ అయ్యే దుస్తులు వేసుకోవడం మానేశాను. ఇప్పుడు అతడు ఎంపిక చేసే దుస్తులనే నేను ధరిస్తున్నాను. అటు ఇండస్ట్రీని, ఇటు అదిల్‌ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఓ లిమిట్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

కానీ.. రాఖీ సావంత్ బిగ్ బాస్ మొదటి సీజన్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లోనూ హౌస్‌లో అడుగుపెట్టి హల్‌చల్‌ చేసింది. ఆదిల్ ఈమె జీవితంలోకి రావడానికి ముందు.. ఓ వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడింది. అయితే, అతనికి అంతకుముందే పెళ్లై పిల్లలున్న విషయం తెలుసుకొని, అతనికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కొంతకాలంలోనే ఆదిల్‌ దురానీతో ప్రేమలో పడింది. అతడు పెళ్లికి ముందే రాఖీ కోసం ఖరీదైన కారు, బంగ్లా కొనిపెట్టాడు. తనని ఇంతలా ప్రేమిస్తున్న ప్రియుడి కోసం.. ఎక్స్ పోజ్ చేయొద్దని పెట్టిన షరతుని ప్రేమగా అంగీకరించింది రాఖీ.

Exit mobile version