Rajinikanth : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరిపై అయినా కామెంట్ ఈజీగా చేసేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. అవి కాంట్రవర్సీ అయినా ఆయన పట్టించుకోడు. రీసెంట్ గా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. రజినీకాంత్ స్లో మోషన్ వాకింగ్ లేకుండా హీరోగా కొనసాగలేడు అన్నాడు. దానికి తాజాగా రజినీకాంత్ కౌంటర్ ఇచ్చారు. ‘వేల్పరి’ అనే బుక్ తమిళనాట బాగా పాపులర్ అయింది. ఈ బుక్ రాసిన రచయితకు అభినందన సభ ఏర్పాటు చేయగా.. దానికి డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథులుగా వచ్చారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ తన మీద తానే సెటైర్లు వేసుకున్నారు.
Read Also : Fatima Sana : ప్రైవేట్ పార్టులు టచ్ చేశాడు.. అమీర్ ఖాన్ కూతురు కామెంట్స్
ఇలాంటి సభలకు కమల్ హాసన్ లేదా శివరాజ్ కుమార్ లాంటి వారిని పిలవాలి. నేను అంత మేథావిని కాదు. 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నడిచే నన్ను ఎందుకు పిలిచారో అర్థం కావట్లేదు అనడంతో సభలో నవ్వులు పూశాయి. ఇందులో రజినీకాంత్ తన మీద తానే సెటైర్ వేసుకున్నట్టు కనిపించినా.. ఈ వ్యాఖ్యలను ఒకసారి గమనిస్తే డైరెక్టర్ ఆర్జీవీకి కౌంటర్ లాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆర్జీవీ కూడా ఇలాంటి కామెంట్లే రజినీకాంత్ మీద చేశాడు. అంటే తాను స్లో మోషన్ తోనే హీరోగా కొనసాగుతున్నానా అని ఇక్కడ రజినీకాంత్ చెప్పాడన్నమాట. ఏదేమైనా రజినీకాంత్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ఇక వేల్పరి బుక్ ను తాను 25 శాతం చదివానని.. మిగతా మొత్తం తాను రిటైర్ అయిన తర్వాత చదువుతానని చెప్పాడు రజినీకాంత్.
Read Also : Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..
