Coolie Trailer : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను 3 నిముషాల కంటే ఎక్కువగానే కట్ చేశారు. ట్రైలర్ లో రజినీకాంత్ లుక్ అదిరిపోయింది. నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ముందు నుంచి అనుకున్నట్టు గానే ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్ లతో ట్రైలర్ ను నింపేశారు.
Read Also : Abhinay Kinger : హీరోకు భయంకరమైన రోగం.. త్వరలోనే చనిపోతాడంట
ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రలు చేస్తున్నారు. శృతిహాసన్ కీ రోల్ ప్లే చేస్తోంది. కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు నాట భారీగా బిజినెస్ జరిగింది ఈ మూవీకి. రజినీకాంత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. లోకేష్ డైరెక్షన్ కాబ్టటి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Read Also : Vijay Deverakonda : ఏంటీ.. అర్జున్ రెడ్డి కోసం విజయ్ ఇంతే తీసుకున్నాడా..