Rajinikanth: ‘వీరసింహారెడ్డి’ని మెచ్చిన తలైవా.. అది బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం, థమన్ మ్యూజిక్, శృతి, హనీ రోజ్ అందాలు అన్నింటికీ మించి ఒక బాలయ్య అభిమానిగా గోపీచంద్ మలినేని టేకింగ్.. ఈ సినిమాను విజయం వైపు తీసుకెళ్లాయి. ఇప్పటికి విజయవంతంగా ఈ సినిమా కొనసాగుతూ రికార్డ్ కలక్షన్స్ ను రాబడుతోంది. అభిమానులే కాకుండా ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమదైన శైలిలో రివ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మలినేని ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
Venkatesh: ఒక్క హిట్ తో వచ్చిన అవకాశం.. ఒక్క ప్లాప్ తో పాయే..?
Also Read
” ఇది నాకు నమ్మలేని ఒక క్షణం.. తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ నుండి కాల్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూసి నాకు కాల్ చేసి.. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. నా సినిమా గురించి ఆయన ప్రశంసించడం, ఆయన భావోద్వేగం
నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. రజినీ, నందమూరి బాలకృష్ణ కు కూడా కాల్ చేసి ఉండొచ్చు.. కానీ, బాలయ్య, తారకరత్న హెల్త్ విషయంలో అప్సెట్ గా ఉండడంతో ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోవచ్చని, ఏది ఏమైనా బాలయ్య సినిమాను రజినీ మెచ్చుకోవడంతో అది బాలయ్య అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
This is a surreal moment for me🤩🤗
Received a call from the Thalaivar, The Superstar @rajinikanth sir. He watched #VeeraSimhaReddy and loved the film.
His Words of praise about my film and the emotion he felt are more than anything in this world to me. Thankyou Rajini sir🙏
— Gopichandh Malineni (@megopichand) January 29, 2023
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!