Site icon NTV Telugu

Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..

Coolie

Coolie

Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. చెన్నైలో మొన్న ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. నేడు హైదరాబాద్ లో మరో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ నాగార్జునపై జోకులు వేశారు. కూలీ మూవీ నాకెంతో స్పెషల్. చాలా ఏళ్ల తర్వాత నా సినిమాలో ఇంత మంది స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటించారు. అసలు సైమన్ పాత్ర గురించి విన్న తర్వాత నేనే చేయాలనుకున్నాను. ఎందుకుంటే ఆ పాత్ర అంత స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాం. చివరకు నాగార్జునతో లోకేష్ ఆరు సార్లు కూర్చుని మాట్లాడిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు.

Read Also : Tamannaah : విరాట్ కోహ్లీతో పెళ్లి చేశారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్

నాగార్జున ఒప్పుకున్నారని తెలిసి చాలా సంతోషించా. నాగార్జున నేను 33 ఏళ్ల క్రితం ఓ సినిమాలో నటించాం. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. నాకు జుట్టు ఊడిపోయింది. ఆయనకు అలాగే ఉంది. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన హెల్త్ డైట్ గురించి అడిగితే.. ఏమీ లేదు సార్ హెల్తీ ఫుడ్ తింటాను, వ్యాయామాలు చేస్తాను అన్నారు. బయటి విషయాల గురించి టెన్షన్ పడొద్దనేది ఇంకో విషయం అన్నారు. ఆయనతో థాయ్ లాండ్ ట్రిప్ ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ నటిస్తున్నారు. ఇది పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమాలోని అన్ని పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. దేనికతే ప్రత్యకంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. తెలుగు నాట ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రమోషన్లలో మూవీ టీమ్ బిజీగా ఉంటుంది.

Read Also : Mass Jathara : మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్

Exit mobile version