Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో మూవీపై మంచి అంచనాలు పెరిగాయి. తెలుగు నాట భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా మూవీ నుంచి తాజాగా కూలీ పవర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో రజినీకాంత్ స్వాగ్ హైలెట్ అవుతోంది.
Read Also : Kingdom : విజయ్ కు మంచి ఛాన్స్.. హిట్ కొడితే వసూళ్ల వర్షమే..
ఈ పవర్ ఫుల్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. లిరికల్ సాంగ్ గా దీన్ని రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా.. అరివు, కోరస్ సాంగ్ పాడారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. బీజీఎం ఆకట్టుకుంటోంది. కూలీ పవర్ అంటూ సాగుతున్న ఈ పాట అనిరుధ్ స్టైల్ ను మరోసారి గుర్తు చేసింది. ఇక ఆగస్టు 02న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. రజినీకాంత్ ఇందులో చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే భారీగా హైప్ పెంచేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రికార్డుల వేటలో ఉంది. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి.
Read Also : Kingdom : అతన్ని నాతోనే ఉంచుకోవాలని ఉంది.. విజయ్ కామెంట్స్
