సూపర్ స్టార్ రజినీకాంత్ కు గత కొన్నేళ్లుగా విజయం అందనంత దూరంలో ఉంది.. హిట్ దర్శకులను నమ్ముకున్నా కూడా రజినీని మాత్రం ఆ ప్లాప్ ల నుంచు గట్టెక్కించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ‘పెద్దన్న’ సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెల్సిందే. ఇక ప్రస్తుతం రజినీ ఫ్యాన్స్ అందరూ తలైవర్ 169 మీదనే ఆశలు పెట్టుకున్నారు. ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం..…