77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా రంగం పరంగా రాజేంద్రప్రసాద్‌తో పాటు మురళీమోహన్‌కు పద్మశ్రీ ప్రకటించారు. అయితే, రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ వెనుక ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి పద్మ అవార్డులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజేంద్రప్రసాద్ పేరును సిఫార్సు చేయగా, ఆయనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది.
Also Read :Vishwak Sen: ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి: విశ్వక్సేన్
అయితే, ఈ మధ్యకాలంలో నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటించారు. ఆ సినిమాలో శ్రీలీల సెక్యూరిటీ చీఫ్‌గా ఆయన ఒక పాత్రలో నటించారు.
ఈ క్రమంలోనే ఒక సన్నివేశంలో శ్రీలీల.. “ఈయన చాలా టాలెంటెడ్ గా ఉన్నారు, ఆయన పేరు నోట్ చేసుకో.. ఈసారి ఏం చేసినా సరే ఆయనకు పద్మ శ్రీ అవార్డు ఇప్పిద్దాం” అంటూ కామెంట్ చేసింది. ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల రాజేంద్రప్రసాద్‌కి విషెస్ చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి వైరల్ అవుతోంది.
#RajendraPrasad garuuu 😅🤗✨🙏 pic.twitter.com/Ud6wcqGmHe
— Venky Kudumula (@VenkyKudumula) January 26, 2026